Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ను 'మినరల్ పవర్‌'గా మారుస్తాం: కిషన్ రెడ్డి

Follow Udayam Digital on Google
Vikram Singh Jun 09, 2026 11:47 AM హైదరాబాద్తెలంగాణ
భారత్‌ను 'మినరల్ పవర్‌'గా మారుస్తాం: కిషన్ రెడ్డి - Udayam Digital
భారత్‌ను 'మినరల్ పవర్‌'గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, క్రిటికల్ మినరల్స్ నుండి కోల్ గ్యాసిఫికేషన్ వరకు భారీ ప్రణాళికలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీఎంఎఫ్ నిధులను గత భారాస, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారిమళ్లించాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 2028లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులు చెల్లించే ఐటీ (ఆదాయపు పన్ను) మొత్తాన్ని పూర్తిగా రీయింబర్స్ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...