వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో లక్ష దీపాలతో దీపోత్సవం నిర్వహించేందుకు ట్రస్టు ఏర్పాట్లు చేపట్టింది. ప్రాంగణాన్ని ఐదు జోన్లుగా విభజించి బాధ్యులను నియమించింది. సుమారు వెయ్యి మంది స్వచ్ఛంద సేవకులు దీపాలను వెలిగించనున్నారు.
ఆలయ ప్రాంగణం, యజ్ఞశాల, దర్శన మార్గాలు సహా పలు ప్రాంతాల్లో దీపాలు వెలిగించనున్నారు. ఐదు రోజుల్లో ఏర్పాట్లు పూర్తవుతాయని ట్రస్టు తెలిపింది.
Comments
Loading comments...

